: ఈ నెల 21 నుంచి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు యాత్ర
తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 21 నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చైదరి తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాటు పూర్తయినట్లు చెప్పారు. ప్రస్తుతం పశ్చిమగోదావరిలో యాత్ర చేస్తున్న బాబు.. 21న కొవ్వూరు నుంచి రాజమండ్రిలోకి ప్రవేశిస్తారని తెలిపారు.
పట్టణంలోని కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మొదట పూలమాలవేసి నివాళులర్పిస్తారని వివరించారు. అనంతరం రాజమండ్రిలో పాదయాత్ర మొదలవుతుందని బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. యాత్ర కడియం, మండపేట, అనపర్తి మీదుగా సాగుతుందన్నారు.