: రవాణా విమానాల ఒప్పందంపై సంతకం చేసిన భారత్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఆరు రవాణా విమానాలు కొనుగోలు చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. రూ.4వేల కోట్ల ఈ ఒప్పందంలో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ ల కోసం ఉపయోగించే సి-30జె సూపర్ హెర్క్యులస్ విమానాలను అగ్రరాజ్యం అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో డిసెంబరు 20న కేబినెట్ కమిటీ సెక్యూరిటీ ఈ ప్రతిపాదన చేసింది. ఈ మేరకు భారత్-యూఎస్ నిన్న (శుక్రువారం) ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాంతో, అమెరికా ఎయిర్ ఫోర్స్ రవాణా విమానాలను సప్లయ్ చేస్తుంది.