: ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పుడే తగులుతున్న కాంగ్రెస్ సెగ
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందే కాంగ్రెస్ అసలు రంగు బయటపడుతోంది. జనవరి 3 లోగా మెజారిటీ నిరూపించుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్ కి సూచించారు. ఇంతలోనే ఆప్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని తమకు అధిష్ఠానం ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న వ్యక్తులు చెప్పారని నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లడించారు. అయితే ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు అర్థరాత్రి వచ్చిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఇంటి వద్దగల సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జి షకీల్ అహ్మద్ ఆప్ కి మద్దతుపై పునరాలోచించేపని లేదని స్పష్టం చేశారు.