: యాషెస్: నాలుగో టెస్టులో విజయానికి చేరువలో ఆసీస్


యాషెస్ సీరీస్ లో ఇంగ్లండ్ మరో పరాభవం ముంగిట నిలుచుంది. మెల్బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా విజయ లక్ష్యం 201 పరుగులుగా ఉంది. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్ లో 51 పరుగులతో వెనకబడ్డ ఆసీస్... రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య ఇంగ్లండ్ ను 179 పరుగులకే కట్టడి చేసింది. లియోన్ 5, మిచెల్ జాన్సన్ 3 వికెట్లు తీశారు. అనంతరం 231 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ వికెట్ కోల్పోకుండా 30 పరుగులు చేసింది. ఓపెనర్లు రోగర్స్ (18), వార్నర్ (12) క్రీజులో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News