: కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు పంపిన హజారే


ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ కు సామాజిక కార్యకర్త అన్నా హజారే లేఖ ద్వారా శుభాకాంక్షలు పంపారు. కేజ్రీవాల్ తో పాటు ప్రమాణం చేసిన సహచరులకు కూడా అన్నా అభినందనలు తెలిపారు. ఏఏపీ నేత అయిన కేజ్రీవాల్ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని నమ్ముతున్నానన్నారు. అయితే, అనారోగ్యం కారణంగా తాను కార్యక్రమానికి హాజరుకాలేకపోయినట్లు లేఖలో వివరించారు.

  • Loading...

More Telugu News