: 2014 ఎన్నికలకు సిద్ధమవుతోన్న కాంగ్రెస్
2014 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఈ మేరకు త్వరలో శాసనసభ అభ్యర్థులకోసం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు పీసీసీ తరపున ఒక్కో స్థానానికి మూడు పేర్లతో కూడిన జాబితాను ఇప్పటికే సిద్ధం చేసింది. జనవరి మొదటివారంలోగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. 13 జిల్లాల్లో ఈ మార్పులు ఉంటాయని సమాచారం. ఇందుకోసం జనవరి మొదటివారం నుంచి అన్ని జిల్లాల కాంగ్రెస్ కమిటీల సమావేశాలు నిర్వహించనున్నారు.