: ప్రపంచస్థాయి ఉత్తమ ఐదు విమానాశ్రయాల్లో మూడు మనవే!
ప్రపంచంలోని ఐదు ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో భారతదేశానికి చెందిన మూడు విమానాశ్రయాలు స్థానం దక్కించుకున్నాయి. ఇవి ప్రయాణికులకు సౌకర్యాలు అందించడంలో, నిర్వహణలో ఏమాత్రం తగ్గకుండా అంతర్జాతీయ స్థాయికి దీటుగా సేవలందిస్తున్నాయి. దీంతో టాప్ ఫైవ్ జాబితాలో ఇవి నిలిచినట్లు 'ఎయిర్ పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేష నల్' (ఏసిఐ) తెలిపింది.
వీటిలో .. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో నిలవగా, ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో, సంవత్సరానికి 25 నుంచి 40 మిలియన్ల ప్రయాణికులకు సేవలందిస్తూ సియెల్ ఇంచెన్ ఎయిర్ పోర్టు మొదటి స్థానాన్నిఆక్రమించింది.
ఇక 5నుంచి 15 మిలియన్ల ప్రయాణికులకు సేవలందించే కేటగిరిలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రెండవ స్థానంలో ఉంది. ఈ కేటగిరిలో తొలి స్థానంలో జపాన్ లోని నగోయా విమానాశ్రయం నిలిచింది.