: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని జయలలితపై ఒత్తిడి
'జయ ఫర్ పీఎమ్' అంటూ ఏఐఏడీఎంకే లో ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను 2014లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ మేరకు ఏఐఏడీఎంకే కార్యకర్తల నుంచి వెయ్యి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి నుంచి 1175 మంది జయపై ఒత్తిడి తెస్తున్నారట.