: ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్షం ప్రారంభం
ఏపీఎన్జీవో హోమ్ లో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, తెలుగుదేశం పార్టీ నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.