: భద్రతాదళాలు... ఉగ్రవాదులు... ఇద్దరిదీ పైచేయే!
జమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది భద్రతాదళాలు, ఉగ్రవాదులు.. ఇరు వర్గాలు ఎవరికి వారే పై చేయిగా ఉన్నారు. ఉగ్రవాద దాడులు ఈ ఏడాది చెప్పుకోతగ్గ స్థాయి (30శాతం)లో తగ్గిపోయాయి. కానీ, జవాన్లు మాత్రం ఎక్కువ మందే బలయ్యారు. మొత్తం 61 మంది జవాన్లు ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందారు. 2011, 2012 రెండు సంవత్సరాలు కలిపి చూసినా ఈ ఏడాది చనిపోయిన జవాన్ల సంఖ్య రెండింతలు పెరిగింది. అదే సమయంలో భద్రతా దళాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల సంఖ్య తగ్గింది. గతేడాది 119 మంది మరణిస్తే.. ఈ ఏఢాది 97 మంది ఉగ్రవాదులే హతమయ్యారు.