: వీటన్నింటికీ కారణం రాజకీయాలు.. వాటిని దాటుకుని విజయం సాధించాలి: కేజ్రీవాల్ పిలుపు
ఇప్పటి వరకు రాజకీయాలు పరిధులు దాటి ప్రవర్తించాయి. రాజకీయాల అసలు ఉద్దేశ్యాన్ని దేశానికి చెప్పడానికే తాము రాజకీయాల్లోకి అరంగేట్రం చేశామని ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. "ఇప్పటి వరకు అధికారం కట్టబెట్టినందుకు సరైన విద్య అందించలేదు. కారణం రాజకీయాలు. వైద్యాలయాల్లో సరైన వైద్యం అందదు. కారణం రాజకీయాలు. సరిపడా విద్యుత్ అందదు. కారణం రాజకీయం. ఇంటి అవసరాలకు సరిపడా నీరు కూడా అందదు. కారణం రాజకీయాలు. సాధారణ ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన ఇల్లు పాడైపోవడానికి పరోక్ష కారణం రాజకీయాలు. ఇప్పుడు వీటన్నింటినీ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది" అని కేజ్రీవాల్ అన్నారు.
తన సహచరుల్ని, అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఇకపై పలు కారణాలు చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు... కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది" అని ఆయన సూచించారు. తాను తన సహచరుల్ని, అధికారులను నమ్ముతున్నానని అన్నారు. ఢిల్లీలో అధికారులంతా మంచివారని, వారంతా కలిసి ప్రజల కోసం పని చేస్తారని తాను నమ్ముతున్నానన్నారు. మంత్రుల మీద, తన మీద అపనమ్మకం పెంచుకోవద్దని ఆయన అన్నారు. అలా అయితే తాను విఫలమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.