: సొంత వైరుధ్యాలతోనే త్వరలో ఏఏపీ ప్రభుత్వం కూలిపోతుంది: బీజేపీ


ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి బీజేపీ శాపనార్ధాలు పెడుతోంది. అవినీతి అంతమొందించేందుకు పోరాడుతున్న ఏఏపీ.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ తో జతకట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విభేదాల వల్ల త్వరలో ఏఏపీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఈ క్రమంలో ఏఏపీ నేతలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కాగా, ఏఏపీకి కాంగ్రెస్ మద్దతుపై పలు రకాలైన వార్తలు వినబడుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒకరు బయటినుంచి మద్దతు అంటే, మరొకరు మేనిఫెస్టో ప్రకారం అంటున్నారన్నారు. ఇంకొకరు బేషరతు మద్దతు అంటున్నారని, కొంతమందైతే అసలు మద్దతే ఇవ్వలేదంటున్నారని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News