: నేడు చరిత్రాత్మక దినం: కేజ్రీవాల్
దేశ రాజకీయాల్లోనే నేడు చరిత్రాత్మకమైన రోజని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనను ముఖ్యమంత్రిగా చేసింది ఢిల్లీ ప్రజలేనని అన్నారు. ఒక సామాన్యుడు కూడా రాజకీయాలను శాసించగలడని ఢిల్లీ ప్రజలు రుజువుచేశారని చెప్పారు. దేశంలోని రాజకీయాల తీరుతో ప్రజలు పూర్తి నిరాశలో ఉండగా... ఢిల్లీ ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చి దేశం తలరాతను మారుస్తామని సంకేతాలిచ్చారని అన్నారు. రెండేళ్ల క్రితం ఇలాంటి రోజు వస్తుందని తాము కలలో కూడా అనుకోలేదని... అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఢిల్లీ ప్రజలేనని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను మిత్రులుగా సంబోధిస్తూ.. అసలు సిసలైన సంగ్రామం ముందుందని చెప్పారు.