: ఇద్దరు పిల్లలుండొచ్చు.. కానీ ఓ కండిషన్!


చైనాలో పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యకు విరుగుడు కనిపెట్టారు. చైనాలో జనాభా గణనీయంగా పెరిగిపోతుండడంతో గతంలో ‘ఒకరికి ఒకరే’ అనే నినాదంతో కుటుంబ నియంత్రణను విరివిగా అమలు చేసి విజయం సాధించారు. ఒక్కసారిగా జనాభా నియంత్రణ అమలు కావడం, దానికి తోడు అప్పుడు దంపతులుగా ఉన్నవారు ఇప్పుడు వయసు మీరడంతో చైనీయుల అవసరాలకు సరిపడా యువత అందుబాటులో లేకపోయింది. దీంతో భవిష్యత్ అవసరాలను గుర్తించి అప్రమత్తమైన ప్రభుత్వం ఉపద్రవ నివారణ చర్యలకు ఉపక్రమించింది.

నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్ పీసీ) ఓ తీర్మానం ఆమోదించింది. దీని ప్రకారం అక్కడి దంపతులు ఇద్దరు పిల్లలను కనొచ్చు కానీ వారు మాత్రం వారి తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం అయి ఉండాలి. లేదంటే వారు ఒక్కరికే పరిమితం కావాలి. దీంతో ఇంతవరకు ఒక్కరే సంతానం అంటూ అమలులో ఉన్న నిబంధన తుడిచిపెట్టుకుపోతోంది. దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణ త్వరలో చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News