: ప్రమాణ స్వీకారానికి మెట్రోరైలులో బయల్దేరి వెళ్లిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఆసీనులయ్యేందుకు అరవింద్ కేజ్రీవాల్ మెట్రో రైలులో బయల్దేరి రామ్ లీలా మైదానానికి చేరుకొన్నారు. మరికాసేపట్లో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి అందరూ ఆహ్వానితులేనని.. వీఐపీలెవరూ లేరని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. దాంతో.. ప్రమాణ స్వీకారోత్సవం వీక్షించేందుకు రామ్ లీలా మైదానానికి ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇప్పటివరకూ తాను చేసిన పోరాటం అధికారం కోసం కాదని.. అవినీతిపైననే అని ఆయన ప్రకటించారు.ఇప్పటి నుంచి చేసే పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామానికి దారితీస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అక్రమార్కులు, అవినీతిపరుల నుంచి దేశానికి విముక్తి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.