: సీఎం కిరణ్ పై వీహెచ్ ఫైర్


ఈ రోజు గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్ డుమ్మా కొట్టారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇది పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్టీ కార్యక్రమానికి కిరణ్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రికి పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయడంపై ఉన్న శ్రద్ధ పార్టీ కార్యక్రమాలపై లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రవర్తనతో పార్టీ కార్యకర్తలకు సీఎం ఎలాంటి సందేశాన్ని పంపదలుచుకున్నారని ప్రశ్నించారు. నిన్న రాహుల్ మీడియా సమావేశానికి కూడా సీఎం కిరణ్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News