: ఢిల్లీ ఏడవ సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న కేజ్రీ


దేశ ప్రజలచే 'క్రేజీ'వాల్ గా పిలిపించుకుంటున్న కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీ ఏడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చరిత్రాత్మక రాంలీలా మైదాన్ లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఆయనతోపాటు ఆయన సహచరులు ఆరు మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరంతా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెట్రో రైలులో రానున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే... కేజ్రీవాల్ ఒక్కో కుటుంబానికి 700 లీటర్ల పరిశుద్ధ నీటి సరఫరా కార్యక్రమ ఫైలుపై సంతకం చేయనున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ వయసు 45 సంవత్సరాల 14 రోజులు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టిన వాడిగా కేజ్రీవాల్ రికార్డులకు ఎక్కబోతున్నారు.

  • Loading...

More Telugu News