: ఆకే కదా అనుకుంటే షాక్‌ కొడుతుంది!


ఆకులే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే, వాటి నుంచి కూడా కరెంటు పుట్టించవచ్చు. రోజు రోజుకూ విద్యుత్తు వాడకం పెరిగిపోతోంది. దీంతో కరెంటును ఎక్కడినుండి ఉత్పత్తి చేయవచ్చు? అని శాస్త్రవేత్తలు పరిశోధనలను సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్ధులు ఆకుకూరల నుండి కూడా కరెంటును పుట్టించవచ్చని చెబుతున్నారు.

బయోటెక్నాలజీలో మూడవ సంవత్సరం చదువుతున్న కార్తీక్‌, సురేష్‌, ప్రసాద్‌ టెక్నోజియాన్‌ క్లోరోప్లాస్ట్‌ మాలిక్యూల్‌, చిప్‌, పాలకూర ఆకులు, నీటి సాయంతో ఒక ప్రయోగాన్ని చేశారు. పాలకూర ఆకుల్ని మెత్తగా చేసి, నీటిలో తడిపి వాటిలో ఎలక్ట్రోడ్‌లను ఉంచారు. ఒక చిప్‌కు క్లోరోప్లాస్ట్‌ మాలిక్యూల్‌ను జతచేసి ఉంచారు. ఎలక్ట్రోడ్‌లు, చిప్‌ అనుసంధానానికి ఎలక్ట్రో మీటర్‌లో రీడింగ్‌ను చూపించారు. ఒక చిన్న ప్లేటులోని ఆకుల్ని, నీటిని తీసుకుని ప్రయోగం చేసినప్పుడు పగలు 0.8 ఓల్ట్‌ల కరెంటు ఉత్పత్తి కాగా మధ్యాహ్నం మండుటెండలో ఉత్పత్తి చేసినప్పుడు 1.1 ఓల్ట్‌ల కరెంటు ఉత్పత్తి అయింది. మొత్తానికి రానున్న కాలంలో కాదేదీ కరెంటు ఉత్పత్తికి అనర్హం అని చెప్పుకోవాల్సి ఉంటుందేమో!

  • Loading...

More Telugu News