: మూడోరోజూ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
మూడోరోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నిన్న 81 పాయింట్ల నష్టంతో సరిపెట్టుకున్న బీఎస్ఈ సెన్స్ క్స్, ఈరోజు ఏకంగా 202 పాయింట్ల నష్టంతో 19,362 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ ఈ నిఫ్టీ 62 పాయింట్లు నష్టపోయి 5,851 వద్ద ముగిసింది.
వడ్డీ రేట్లపై మార్చి 19న జరిగే రిజర్వ్ బ్యాంకు సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో మార్కెట్లు వరుస నష్టాలను చవి చూస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, సెన్స్ క్స్ లో భారతీ ఎయిర్ టెల్, ఐటిసి లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలివర్, టాటా పవర్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, జిందాల్ స్టీల్ ప్లాంట్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.