: హెచ్ సీఎల్ టెక్నాలజీస్ బోర్డు నుంచి తప్పుకున్న వినీత్ నాయర్
ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన హెచ్ సీఎల్ టెక్నాలజీస్ బోర్డు నుంచి వినీత్ నాయర్ తప్పుకున్నారు. 2008 నుంచి బోర్డు సభ్యుడిగా ఉన్న ఆయన, గత ఏడాది జూన్ లో తన వద్దనున్న స్టాక్స్ అన్నీ అమ్మి 134 కోట్ల రూపాయలతో సంపర్క్ ఫౌండేషన్ అనే లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ ఫౌండేషన్ కార్యక్రమాల్లో అత్యధిక సమయం గడిపేందుకే ఆయన హెచ్ సీఎల్ బోర్డును వీడుతున్నట్టు తెలిపారు.