: అక్కడ 60 కదా, ఇక్కడ 208 ఎందుకు?: సీఎంకు బాబు లేఖ
హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల వ్యవహారంలో వస్తున్న అవినీతి ఆరోపణలను బాబు ఈ లేఖలో ప్రస్తావించారు. ద్విచక్రవాహనాలకు ఢిల్లీలో హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కు 68 రూపాయలు వసూలు చేస్తుండగా, హర్యానాలో 60 రూపాయలు వసూలు చేస్తున్నారు.
అయితే మన రాష్ట్రంలో మాత్రం 208 రూపాయలు వసూలు చేస్తున్నారని, అది సబబు కాదని ఆయన స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్ల వ్యవహారంలో వెలుగు చూస్తున్న అవినీతిపై సీబీ, సీఐడీతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యేవరకు నెంబర్ ప్లేట్ల అమలు ప్రక్రియ నిలిపేయాలని బాబు కోరారు.