: వారిపై చర్యలు తీసుకోకుండా జేసీకి షోకాజ్ ఏంటి?: మంత్రి రామచంద్రయ్య


అధిష్ఠానంపై జేసీ దివాకర్ రెడ్డి కంటే ఘాటు వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జేసీకి షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారని మంత్రి సి రామచంద్రయ్య ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి కారణంగా మంత్రిగా జిల్లాకు ఒక్క పనీ చేయలేకపోతున్నానన్నారు. శ్రీవారి దర్శనానికి సామాన్య భక్తుల కంటే వీఐపీలే ఆరాటపడుతున్నారని, అందుకే పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

జనవరి 1న వీఐపీ పాస్ లు జారీ చేస్తే అందులో బోర్డు సభ్యులే అధికంగా ఉన్నారన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. పులివెందులలో బాసర తరువాత అంతటి సరస్వతీ దేవాలయాన్ని నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News