: గోమాతను రక్షించుకుందాం అనే సందేశంతో 'గోమాత' సీరియల్ ప్రారంభం


గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అంశంతో తెరకెక్కుతున్న ధారావాహిక 'గోమాత' షూటింగ్ హైదరాబాదులోని సారథి స్టూడియోస్ లో ప్రారంభమైంది. దీనిని పరిపూర్ణానంద స్వామి నిర్మిస్తుండగా విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీవీ వినాయక్, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి, సాయికిరణ్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందని అభిప్రాయపడ్డారు. యజ్ఞం లాంటి ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. గంగ, భగవద్గీత, తులసి, గోమాతలు ఆరాధ్యనీయాలని, 84 లక్షల జీవరాసుల్లో మాతగా పిలవబడే అర్హత గోవుకే ఉందని తెలిపారు. హైందవ ధర్మరక్షణలో భాగంగా ఈ సీరియల్ ను భారతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సీరియల్ లో నటించడం తన అదృష్టం అని నటుడు సాయికిరణ్ తెలిపారు. ఈ సీరియల్ లో సుమన్, కన్నడ శ్రీధర్, రఘునాథరెడ్డి, రాగిణి, సన తదితర నటులు నటించనున్నారు.

  • Loading...

More Telugu News