: గుజరాత్ అల్లర్లు నన్ను కలచివేశాయి: మోడీ
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు తనను ఎంతగానో కలచివేశాయని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తెలిపారు. అహ్మదాబాద్ లో ఆయన మాట్లాడుతూ అవి చాలా దుర్దినాలనీ, అలాంటి సంఘటనలు ఎవరి జీవితంలోనూ చోటు చేసుకోకూడదని అన్నారు. నిన్నటి తీర్పుతో తన మనసుపై నుంచి పెనుభారం దిగిపోయినట్టైందని అన్నారు. ఇన్నాళ్లూ భరించిన అపనిందలు, భారం తనను కలచి వేసినా ఇప్పుడు ప్రశాంతంగా ఉందని తెలిపారు.
అల్లర్లపై ఎప్పుడూ మీడియాతో మాట్లాడని మోడీ తన బ్లాగులో సుదీర్ఘమైన ప్రకటన పోస్ట్ చేశారు. ఆనాటి అమానవీయ ఘటనను కఠినపదాలతో వర్ణించారు. వ్యక్తిగతంగా తాను పడ్డ బాధను ఇన్నాళ్లకు తొలిసారి వ్యక్తీకరిస్తున్నానని మోడీ అభిప్రాయపడ్డారు.