: సంక్రాంతికి ప్రత్యేక రైళ్ళు ఇవిగో!
సంక్రాంతి పండుగకు ఏర్పడే రద్దీని పురస్కరించుకుని దక్షణమధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖల మధ్య పలు రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. జనవరి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 11. 15 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు, జనవరి 4, 11, 16, 23, 30 తేదీల్లో రాత్రి 11గంటలకు విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు ఈ రైళ్లను నడపేందుకు నిర్ణయించింది. జనవరి 4, 11, 18, 25, ఫిబ్రవరి 1 తేదీల్లో రాత్రి 7.05 నిమిషాలకు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ఏసీ సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు తెలిపింది.