: నాంపల్లి రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
హైదరాబాద్ లో మరోసారి బాంబు కలకలం రేగింది. ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే నాంపల్లి రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద బాంబు ఉన్నట్టు ఫోన్ కాల్ వచ్చింది. ఈ బెదిరింపు ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న బాంబు స్క్వాడ్ అణువణువూ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.