: అక్కను కిరోసిన్ తో తగులబెట్టిన తమ్ముడు
మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలంలోని రాయవరంలో సొంత అక్కనే కిరోసిన్ పోసి తగలబెట్టాడో కసాయి తమ్ముడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మంగమ్మ(45)కు, అతని సోదరుడు బొందయ్యకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బొందయ్య అక్క మంగమ్మపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.