: సెంచరీ చేజార్చుకున్న మురళీ.. రోహిత్ డకౌట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో స్టెయిన్ ధాటికి భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 97 పరుగులు (18 ఫోర్లు) చేసిన మురళీ విజయ్ స్టెయిన్ బౌలింగ్ లో డీవిలియర్స్ కి క్యాచ్ ఇచ్చి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. పుజారా (70) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ పరుగుల ఖాతాను తెరవకుండానే స్టెయిన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం కోహ్లి (7), రహానే (0) ఆడుతున్నారు. భారత్ 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఈ రోజు మొత్తం మూడు వికెట్లనూ స్టెయినే పడగొట్టడం విశేషం.