: రక్షణ తీసుకోమని మూడోసారి కేజ్రీవాల్ ను కోరతాం: ఢిల్లీ పోలీసులు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న అరవింద్ కేజ్రీవాల్ ను రక్షణ తీసుకోమని చివరిసారి కోరతామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. తొలిసారి రక్షణ కల్పిస్తామంటూ ఈ నెల 23న కేజ్రీవాల్ కు లేఖ రాశామని.. అయితే, 'దేవుడే తనను రక్షిస్తాడు..' అంటూ ఆయన సమాధానమిచ్చారని చెప్పారు. రెండవసారి అంటే 24న మళ్లీ లేఖ రాస్తే ఇంతవరకు సమాధానం ఇవ్వలేదన్నారు. ఇక రేపు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో మూడోసారి లేఖ రాస్తామని చెప్పారు. ఈసారి కూడా ఆయన నిరాకరిస్తే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News