: రాష్ట్రానికి మరికొన్ని రైళ్లు
ఇటీవల ప్రకటించిన రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పై అవ్యాజమైన ప్రేమ కురిపించిన రైల్వే శాఖ.. తాజాగా రాష్ట్రానికి మరికొన్ని రైళ్లను కేటాయించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజా కేటాయింపుల్లో తిరుపతి-కరీంనగర్ మధ్య బైవీక్లీ రైలు, నర్సాపూర్- నాగర్ సోల్ మధ్య వీక్లీ రైలు.. గుంటూరు, నడికుడి, నల్గొండ మీదుగా కాకినాడ-ముంబయి రైలును నడపనున్నారు. ఇక సికింద్రాబాద్-చండూరు మధ్య మెము రైలును కూడా ప్రవేశపెట్టనున్నారు.