: కరెన్సీ నోట్లపై 'సీమాంధ్రులను వెళ్లగొట్టండి'


కరెన్సీ నోట్లపై 'డిసెంబర్ 31 తర్వాత సీమాంధ్ర వాళ్లను వెళ్లగొట్టండి' అని తెలుగులో స్టాంపు ముద్రలు వేసి ఉన్న పది రూపాయల కరెన్సీ నోట్లు రాష్ట్రంలోని పలు చోట్ల దర్శనమిస్తున్నాయి. ఈ నోట్లు అటు తెలంగాణ వారితోపాటు సీమాంధ్రులకూ చేరాయి. దీనిపై సీమాంధ్ర వాసులు మండిపడుతున్నారు. దీనిపై కర్నూలు జిల్లాలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విభజన వాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణవాదుల తీరు ఇప్పుడే ఇలా ఉంటే విభజన జరిగితే మరెలా ఉంటుందో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విభజన తరువాత సీమాంధ్రులకు రక్షణ ఎలా ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News