: విరిగిపోయిన 2 వేల ఏళ్ల నాటి పురాతన విగ్రహం


కోల్ కతా మ్యూజియంలో ఉన్న రెండు వేల ఏళ్ల నాటి అపురూప పురాతన విగ్రహం ఒకటి విరిగిపోయింది. కోల్ కతా లోని నేషనల్ మ్యూజియంలో అశోక చక్రవర్తి సమయంలో చెక్కినదిగా భావిస్తున్న రాంపూర్వ లయన్ కేపిటల్ అనే విగ్రహం (ఏడడుగుల సింహం) ఒక చోట నుంచి మరో చోటికి మారుస్తున్నప్పుడు పడిపోయి విరిగినట్టు సమాచారం. మ్యూజియం నిర్మించి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాల కోసం సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

కాగా విగ్రహం పగిలిన ఘటన ఏదీ తన దృష్టికి రాలేదని మ్యూజియం ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఎంకే నారాయణ్ తెలిపారు. మరోపక్క, విగ్రహం తమ దగ్గరకు వచ్చేసరికి విరిగి, అతికించి ఉందని, తరలించేందుకు తేలిగ్గా ఉంటుందని ఆ అతుకును తాము విడదీశామని సిబ్బంది తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం విగ్రహం చాలా చోట్ల విరిగినట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News