: నేషనల్ పోలీస్ అకాడమీకి తొలి మహిళా బాస్!
హైదరాబాదులోని 'నేషనల్ పోలీస్ అకాడమీ'(ఎన్ పీఏ)కి బాస్ గా త్వరలో ఓ మహిళా ఐపీఎస్ అధికారిణి రానున్నారు. ఈ మేరకు 1979 ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్ కు చెందిన అరుణ బహుగుణను నియమించనున్నారు. 65 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థకు మొదటిసారి ఓ మహిళను బాస్ గా నియమించడం విశేషం. ప్రస్తుతం అరుణ సీఆర్పీఎఫ్ ప్రత్యేక డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే కొత్త డైరెక్టర్ గా ఆమెను నియమిస్తూ పోలీస్ అకాడమీ ఉత్తర్వులు ఇవ్వనుందని సమాచారం. అరుణ ఇప్పటికే పలు పదవుల్లో పనిచేసారు.