: సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి పాక్ ఉగ్రవాదుల పనే: కేంద్ర హోం శాఖ


కాశ్మీర్ లోని బెమినా వద్ద సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి పాకిస్తాన్ ఉగ్రవాదుల పనే అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడుల్లో పాల్గొన్న నలుగురు టెర్రరిస్టులు పాక్ నుంచే వచ్చారని హోం శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ వెల్లడించారు.

ఈ ఉదయం జరిగిన ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారని, మరో ఐదుగురు గాయపడ్డారని సింగ్ తెలిపారు. ఇక మిలిటెంట్లలో ఇద్దరు హతమవగా, మరో ఇద్దరు తప్పించుకున్నారని ఆయన చెప్పారు. కాగా, కాశ్మీర్ లో మూడేళ్ల అనంతరం టెర్రరిస్టులు జరిపిన అతిపెద్ద దాడి ఇదే. 

  • Loading...

More Telugu News