: ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: విద్యాసాగర్ రావు
రానున్న ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయన్న వార్తలకు బీజేపీ నేత విద్యాసాగర్ రావు తెరదించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్ర నేతల సమ్మతం లేకుండా బీజేపీ హైకమాండ్ టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ పై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. కిరణ్, చంద్రబాబు, జగన్ లు టీబిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.