: టీమిండియా ఆశలకు గండి.. వరుణుడి దెబ్బకు రెండో రోజు ఆట హుళక్కే


సౌతాఫ్రికాలో మొదటి టెస్టు స్ఫూర్తితో రెండో టెస్టులో భారీ స్కోరు సాధించాలన్న టీమిండియా ఆశలకు వరుణుడు గండికొట్టాడు. తొలి రోజు కేవలం 61 ఓవర్లు మాత్రమే ఆటకొనసాగనిచ్చిన వరుణుడు రెండో రోజు కూడా తన ప్రతాపం చూపించాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 181 పరుగులు చేసిన టీమిండియా. రెండో రోజు మరిన్ని పరుగులు సాధించి సఫారీలకు సవాలు విసిరేందుకు సిద్ధమైంది.

మురళీవిజయ్ 91 పరుగులతోనూ, ఛటేశ్వర్ పూజారా 58 పరుగులతోనూ ఆడుతున్నారు. కాగా డర్బన్ లో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది. పిచ్ ను కవర్లతో కప్పి ఉంచినప్పటికీ అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా తయారైంది. వెలుతురు కూడా సరిపడినంత లేదు. దీంతో రెండో రోజు ఆట కొనసాగడం అనుమానమే.

  • Loading...

More Telugu News