: జనవరి 23న చెప్తా: జేసీ
జనవరి 23న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ పార్టీ తనకు షోకాజ్ నోటీసు జారీ చేయడమంటే సీనియర్ నేతల గొంతు నొక్కడమేనని అన్నారు. తన చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని.... తానే నిర్ణయం తీసుకుంటానని జేసీ వెల్లడించారు. బొత్స కూడా పార్టీలు మారేవారి లిస్టు తన దగ్గర ఉందనడం, జేసీ కూడా పార్టీ మారుతారన్న ఊహాగానాలు గత కొంత కాలంగా వినిపిస్తుండడంతో... జేసీ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆసక్తిగా చూస్తున్నాయి.