: 180 కోట్ల మోసం కేసులో సుఖేష్ గుప్తా అరెస్టు
బంగారం దిగుమతి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ మినరల్స్ అండ్ మెటల్స్ కార్పొరేషన్ ను మోసం చేసిన కేసులో ఎంబీఎస్ జ్యుయలర్స్ సంస్థ యజమాని సుఖేష్ గుప్తాను సీబీఐ పోలీసులు అరెస్టు చేశారు. 2012లో జరిగిన ఈ మోసం కేసుపై ఈ ఉదయం నుంచి కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ప్రముఖ బంగారు ఆభరణాల సంస్థ ముసద్దీలాల్ భగవత్ స్వరూప్ (ఎంబీఎస్) జ్యుయలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను విచారించిన సీబీఐ అధికారులు అనంతరం ఆయనను అరెస్టు చేశారు.