: హృతిక్, సుసన్నే విడిపోయినా.. కలిసే ఉంటారట


హృతిక్, సుసానే విడిపోవాలని నిర్ణయించుకున్నా... పిల్లల విషయంలో ఒక్కటిగానే ఉండనున్నారు. ఇటీవలే వారు పిల్లలతో కలుసుకున్నారు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. సుసానే ముంబైలో స్టోర్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. తాను, హృతిక్ విడిపోయినా ఆ ప్రభావం పిల్లలపై పడిపోరాదన్నారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యత నెరవేరుస్తామని చెప్పారు. ఈ విషయంలో తామిద్దరం సమన్వయంతో వెళతామన్నారు. సో... విడిపోయినా పిల్లల కోసం కలిసి నడుస్తారన్నమాట.

  • Loading...

More Telugu News