: అసెంబ్లీలో 144 సెక్షన్ పెట్టాల్సింది: దాడి
ఈరోజు ప్రారంభమైన శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఎమ్యెల్యేల కంటే పోలీసులే ఎక్కువగా కనిపిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. పోలీసులను భారీ సంఖ్యలో నియమించిన సర్కారు అసెంబ్లీలో 144 సెక్షన్ విధిస్తే బాగుండేదని ఆయన అన్నారు.
ఇక ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలో కొత్తదనమేదీ కనిపించలేదని దాడి విమర్శించారు. గవర్నర్ తో సర్కారు అసత్యాల ప్రసంగం చదివించిందని ఆయన ఆరోపించారు. గవర్నర్ లో రాజ్యాంగ స్పూర్తి కొరవడిందని దాడి పేర్కొన్నారు.