: చంద్రబాబుకే మళ్లీ పట్టంకడదాం: మురళీమోహన్


రాష్ట్ర ప్రజలకు నీతివంతమైన పాలన అందించిన చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టాలని టీడీపీ నేత, సినీ నటుడు మురళీమోహన్ ప్రజలను కోరారు. ఈ రోజు ఆయన రాజమండ్రిలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిగా అవినీతిపరులతో నిండిపోయిన జగన్ పార్టీకి పాలించే అర్హత లేదని అన్నారు. రాహుల్ ని దేశ ప్రధాని చేసేందుకే ఆయన తల్లి సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పాల్పడ్డారని విమర్శించారు.

  • Loading...

More Telugu News