: గిన్నిస్ బుక్ లో ఎక్కేందుకు సుదీర్ఘ పాఠం
గిన్నిస్ బుక్ లో తన పేరును పొందుపరిచేందుకు వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుడు లక్ష్మణ్ పెద్ద సాహసమే చేస్తున్నారు. కాలేజీలో గంట, రెండు గంటలు కాదు.. ఏకంగా 125 గంటలపాటు ఏకధాటిగా పాఠం చెబుతున్నారు.
పోలండ్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ప్రజాస్వామ్యంపై ఏకధాటిగా 121 గంటలపాటు ఇచ్చిన లెక్చర్ తో గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ నెల 9 వరకు అలుపు లేకుండా పాఠం చెప్పి ఈ రికార్డును తుడిచేస్తానంటున్నారు మన లెక్కల మాస్టారు.