: 96 అరటి పండ్లతో మింగిన గొలుసు బయటకు రప్పించారు
కొట్టేసిన బంగారు గొలుసును దొంగ తెలివిగా మింగితే.. దొంగతో బలవంతంగా అరటిపండ్లు తినిపించి గొలుసును బయటకు రప్పించారు ముంబైలోని కల్యాణ్ పోలీసులు. ఈ నెల 22న విదర్భ ఎక్స్ ప్రెస్ ఎస్7 బోగీలో ముంబై బాంద్రా ప్రాంతానికి చెందిన డాక్టర్ షీతల్ కాంబ్లే ప్రయాణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన దాముగుప్తా(28) డాక్టర్ మెళ్లో 11 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పారిపోతుంటే ఆమె కేకలు పెట్టింది. ప్రయాణికులు వెంటపడి పట్టుకున్నారు. తాను అమయాకుడినని, తనకేమీ తెలియదన్నాడు. కానీ పోలీసులు స్కానింగ్ ద్వారా అతడి కడుపులో చైన్ ఉందని గుర్తించారు. డాక్టర్ సలహాతో 8 డజన్ల అరటి పండ్లు దాముతో తినిపించారు. అరటి పండు సుఖ విరేచనకారి. అన్ని పండ్లు తింటే చైన్ ఆగుతుందా? నిక్షేపంలా బయటకు వచ్చేసింది.