: అఖిలేశ్ పాలనలో యూపీ పురోగతి వైపా.. అధోగతి వైపా?


ఉత్తరప్రదేశ్.. కుల రాజకీయాలకు, గూండాయిజానికి, నేరాలకు, అశాంతికి ప్రధాన కేంద్రమనే చెప్పుకోవచ్చు. అసమర్థ నేతల పాలనలో యూపీ, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు నేటికీ పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. అఖిలేశ్ యాదవ్ ఉన్నత విద్యావంతుడు, యువకుడు. యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుందని కొందరు ఆశించారు. కానీ, తాను తన తండ్రి ములాయం వారసుడినేనని ఆయన పాలన స్పష్టం చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాలు నిత్యకృత్యమైపోయాయి. గూండాయిజం మరింత పెరిగిపోయింది. అఖిలేశ్ సర్కారులోని పలువురు మంత్రులు నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. మత ఘర్షణలు కూడా మళ్లీ పతాక స్థాయికి చేరాయి. ఇందుకు రెండు నెలల క్రితం జరిగిన ముజఫర్ నగర్ ఘర్షణలే నిదర్శనం. ముజఫర్ నగర్ జిల్లాలో రెండు మతాల ప్రజల మధ్య చెలరేగిన ఘర్షణలో 60 మంది వరకూ మరణించారు. వేలాది మంది నేటికీ సహాయక శిబిరాల్లో బిక్కు బిక్కుమంటున్నారు. ఈ శిబిరాల్లో 34 మంది చిన్నారులు కన్నుమూయడమే ఇప్పడు సంచలనం కలిగిస్తోంది.

వీరంతా చనిపోతుంటే అఖిలేశ్ సర్కారు ఏం చేస్తోంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజానికి అఖిలేశ్ ప్రభుత్వం తొలుత చిన్నారులు చనిపోలేదంటూ బుకాయించింది. కానీ, ప్రభుత్వం నియమించిన కమిటీయే న్యూమోనియా కారణంగా 34 మంది చిన్నారులు మరణించారని అధ్యయనం చేసి మరీ నిగ్గుతేల్చింది. ఇలాంటి నేతల పాలనలో ప్రజా సంక్షేమం నాస్తి.

  • Loading...

More Telugu News