: ఉద్యమకారిణి రోశమ్మకు ఫోన్ లో బాలకృష్ణ పరామర్శ
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మద్యపాన వ్యతిరేక ఉద్యమకారిణి రోశమ్మను సినీనటుడు బాలకృష్ణ ఫోన్ లో పరామర్శించారు. మీకేం భయం లేదని, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా జలదంకి మండలం దూబగుంటకు చెందిన రోశమ్మ కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైంది. విషయం తెలుసుకున్న జిల్లా టీడీపీ నేతలు బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోశమ్మను నిన్న పరామర్శించారు. అనంతరం జిల్లా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆమెకు రూ.25వేల చెక్కును బాలకృష్ణ పేరు మీద అందించారు. ఈ సందర్భంగా రోశమ్మతో బాలకృష్ణ మాట్లాడారు.