: మోడీపై కాంగ్రెస్ మరో బాణం... 'స్నూప్ గేట్'పై విచారణ కమిషన్


బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని ఏదో విధంగా దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. 2009లో ఓ మహిళపై అక్రమంగా నిఘా పెట్టిన వ్యవహారం (స్నూప్ గేట్)లో మోడీ హస్తం ఉందంటూ... ఓ విచారణ కమిషన్ ను నియమించాలని నిర్ణయించింది. ఈ కమిషన్ కు సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. ఈ కమిషన్ మూడు నెలల్లోగా విచారణను ముగించి నివేదిక అందజేస్తుంది.

2002నాటి అల్లర్ల కేసులో మోడీ పాత్ర లేదంటూ... నిన్న అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే, కాంగ్రెస్ స్నూప్ గేట్ వ్యవహారాన్ని అందుకోవడం గమనార్హం. హడావుడిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం... మరో పెను రాజకీయ వివాదానికి ఆజ్యం పోసింది. రానున్న సాధారణ ఎన్నికల్లో మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ అఖండ మెజారిటీ సాధిస్తుందన్న భయంతోనే, కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రతీకార చర్యలకు దిగిందంటూ బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది.

  • Loading...

More Telugu News