: ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రక్కును ఢీకొన్న ఆటో : ఐదుగురి మృతి
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న ట్రక్కును టాటాఏస్ ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు.