: గవర్నర్ ప్రసంగంపై చంద్రబాబు మండిపాటు
ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రసంగమంతా తప్పుల తడకగానే సాగిందని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న చేనేత రంగాన్ని కాంగ్రెస్ మరింత సమస్యల్లోకి నెట్టిందన్నారు.
పావలా వడ్డీ అని చెప్పి రూపాయి వరకూ వసూలు చేస్తున్నారని ఎంతోమంది మహిళలు తిట్టుకుంటున్న విషయం మీకు తెలియడంలేదా? అని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉపాధి హామీ పథకం అవినీతిమయమైందన్న ఆయన ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో భాగంగా పూలపల్లిలో బాబు మీడియా