: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను చంపేసింది
తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా భర్తనే హతమార్చింది ఓ భార్య. తన ప్రియుడితో కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. భర్తను హత్య చేసిన అనంతరం బత్తుల దుర్గ తన ప్రియుడితో కలిసి పరారయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఉదయం జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు తెలియజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గతంలో కూడా బత్తుల దుర్గ తన భర్తపై హత్యాయత్నం చేసి జైలుకు వెళ్లి వచ్చింది. తన వివాహేతర సంబంధాన్ని భర్త నిలదీయడంతో... ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని స్థానికులు తెలిపారు.