: అఫిడవిట్లతో జగన్ రాజకీయం చేస్తున్నారు: మధుయాష్కీ


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ఈ రోజు రాష్ట్రపతిని కలిసిన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ కూడా అఫిడవిట్లు సమర్పించాలని డిమాండ్ కూడా చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ మధుయాష్కీ.. అఫిడవిట్లతో జగన్ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచినట్టు జగన్ ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేందుకు సీమాంధ్ర పాలకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News